రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్విర్యమైపోతున్నాయని ప్రభుత్వ విద్య వ్యవస్థ బలహీనపడుతుందని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నడిగూడెంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామీణ పాఠశాలలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారని ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజా ప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.