కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడంలో జాప్యం తగదని సామాజిక ఉద్యమకర్త సయ్యద్ బషీరుద్దీన్ శనివారం కోదాడలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పేద ప్రజలు తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అనేకసార్లు దరఖాస్తులు తీసుకొని పరిశీలన పేరుతో కాలం వృధా చేయడం సరికాదన్నారు. పెరుగుతున్న నిత్యావసరదారులను దృష్టిలో పెట్టుకొని వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు.