కోదాడ టౌన్ అవుట్డోర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కెవి ఫీడర్4 లో అత్యవసర మరమ్మత్తులు కారణంగా గురువారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు శ్రీరంగాపురం గ్రామానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బానోతు నరసింహ నాయక్ ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వినియోగదారులు ఇట్టి అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.