కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్ లో ఆదివారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి రోడ్డు పక్కన ఉన్న చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు రహదారిపైకి వాలడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నాయి. పట్టణంలో పలు వీధుల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సంబంధిత అధికారులు స్పందించి చెట్ల కొమ్మలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.