కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ఉయ్యాల నరసయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన కష్టపడి చదివి 2009 లా డిగ్రీ చేసి 2010లో లాయర్ గా బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్నారు. స్వశక్తితో ఎదిగిన ఆయన గతంలో అసోసియేషన్ లో కోశాధికారిగా కోశాధికారిగా, జాయింట్, లైబ్రరీ సెక్రటరీగా, ఉపాధ్యక్షునిగా పలు పదవులు నిర్వహించారు. తిరిగి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నరసయ్యను పలువురు అభినందించారు.