
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వాడేవారికి అలర్ట్
ఆగస్టు 1 నుంచి UPI నిబంధనల్లో కీలక మార్పులు జరగనున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. అలాగే, SIPలు, OTT సభ్యత్వాల వంటివి ఇకపై నాన్-పీక్స్ అవర్స్‌లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఆటోపేమెంట్లు నడుస్తాయి. ఈ మార్పులతో UPIపై భారం తగ్గనుంది.