కోదాడ: వృత్తి విద్య నైపుణ్యాలు పెంచుకోవాలి

55చూసినవారు
కోదాడ: వృత్తి విద్య నైపుణ్యాలు పెంచుకోవాలి
విద్యార్థులు చదువుతోపాటు వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. మంగళవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతీయ హరితదళం ఆధ్వర్యంలో సబ్బు తయారు చేయడంపై నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల ఎకో క్లబ్బులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజ్, హరితహారం ప్రాజెక్టు ఆఫీసర్ రాజశేఖర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్