వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరుకావాలని మోతే మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శీలం సైదులు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సర్వారంలో రజతోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.