కోదాడ: ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి

63చూసినవారు
కోదాడ: ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని అశోక్ నగర్, శ్రీరంగాపురం ఏరియాల్లో బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు సదుపాయాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్