కోదాడ: కోదాడలో గాలి దుమారం భీభత్సవం

51చూసినవారు
కోదాడ పట్టణం లో అప్పటివరకు సూర్యుడు భగభగ లతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చల్లబడింది. అంతేకాక ఉరుములు మెరుపులతో కూడిన గాలి దుమారం లేచింది. గాలి తీవ్రతకు చెత్త చెదారం రోడ్లపై నుండి ఇండ్ల ముంగిటకు చేరింది. గాలి దుమారానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉరుములు మెరుపులతో సన్నని చిరుజల్లులు కురిసాయి. గాలి దుమారానికి మామిడికాయలు రాలిపోయే అవకాశం ఉందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్