కోదాడ: విద్య ద్వారానే మహిళా అభ్యున్నతి

57చూసినవారు
కోదాడ: విద్య ద్వారానే మహిళా అభ్యున్నతి
విద్య ద్వారానే మహిళా అభ్యున్నతి జరుగుతుందనీ కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, మహిళా ఉపాధ్యాయులు మీనాక్షి, పద్మావతి, హేమలత, కళ్యాణి , కరుణ, కనకమ్మ, రాణి, సునీల, సరిత, పద్మ ఉన్నారు.