ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారులపై ఉన్న భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని, జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను నివారించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను బస్సు ఎక్కించుకునేటప్పుడు డ్రైవర్లు నెమ్మదిగా ఎక్కించుకోవాలని, మలుపుల వద్ద వేగాన్ని నిరోధించాలని తెలియజేశారు.