
నాపై ట్రోల్స్ చేస్తూ.. దూషిస్తున్నారు: విడదల రజిని
సోషల్ మీడియాలో, ABN ఛానల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందంటూ మాజీ మంత్రి విడదల రజిని జాతీయ మహిళా కమిషన్ (NCW), జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC)లకు ఫిర్యాదు చేశారు. ట్రోల్స్ చేస్తూ.. దూషిస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు. మాజీ CM జగన్, ఆయన కుటుంబసభ్యులు, మాజీ మంత్రి రోజాపై కూడా ఇలాగే చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా హ్యాండిల్స్, ABNపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.