శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుందని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.