రెండు లక్షల రుణమాఫీ సందర్భంగా కోదాడ పీఏసీఎస్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తం పద్మావతి ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేష్, ప్రభాకరరావు రమాదేవి, చంద్రమౌళి, సీఈవో మంద వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, రాములు, సత్యనారాయణ, కోటయ్య ఉన్నారు.