మునగాల మండలంలో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక కార్యకర్త గంధం సైదులు, బీసీయువజన సంఘం నాయకులు గడ్డం లక్ష్మీనారాయణ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుధవారం మునగాల మండల కేంద్రం లో తహసీల్దార్ ఆంజనేయులు కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. వ్యవసాయ శాఖాధికారుల తో పంట నష్టాన్ని అంచనా వేయించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.