కోదాడ మండలం కాపుగల్లు గ్రామ శివారులో రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి ని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో సదరు వ్యక్తిని విచారిస్తే అసలు విషయం బయటకు పొక్కాడు. తాను కొన్న బియ్యం జగ్గయ్యపేట మండలం వ్యక్తికి అమ్ముతున్నానని చెప్పాడు. దీంతో ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల పోలీసులు వెళ్లి తనిఖీలు చేయగా 1284 బస్తాలు సుమారు 65 టన్నుల రేషన్ బియ్యం దొరికింది.