కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ నియంత్రికల చుట్టూ ఇండియన్ వెటర్నర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్షణ గోడను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు మాజీ సైనిక అధికారి గుండా మధుసూదన్ రావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలే సంస్థ లక్ష్యమన్నారు.