కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ పరిధిలోగల నెమలిపురి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల వసతి గృహ విద్యార్థులు మంచి నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రాత్రి నుండి వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో నీరు రాక కాలనీ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వాడు కునే నీళ్ళ కోసం కిలోమీటర్ దూరం నడిచి వెళుతున్నారు. అధికారులు నీటి వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.