సుప్రీం కోర్టు, హైకోర్టు సేవలు దేశ ప్రజలందరికి అందుబాటు లోకి తేవాలని కోదాడ ప్రముఖ న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ కేంద్ర ప్రభుతానికి విజ్ఞప్తి చేసారు. శనివారం కోదాడ నుండి ప్రధాని నరేంద్ర మోడీ కి ఈ మెయిల్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. దేశంలో సుప్రీం కోర్టు బెంచ్ లు రెండు రాష్ట్రాల కు ఒకటి, హైకోర్టు బెంచ్ లు రెండు జిల్లా లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.