సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వాహనదారులకు వ్యాపారస్తులకు మధ్య గొడవ జరిగింది. పాపిరెడ్డి ప్లాజా వద్ద వాహనాదారులకు తోపుడుబండ్ల వ్యాపారస్తులకు మధ్య ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి. కాగా వెంటనే కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ వారు ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.