ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఇతర వాహనాలు కండిషన్ లో ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ యాజమాన్యాలు డ్రైవర్ల నియామకంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులను డ్రైవర్లుగా నియమించుకోవాలన్నారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లల పట్ల డ్రైవర్లు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.