కోదాడలోని శ్రీ గుంటి రఘునాథ స్వామి ఆలయంలో మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం వేద పండితులు సుశర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, ఆలయ చైర్మన్ గుడు గుంట్ల రంగయ్య, అభివృద్ధి కమిటీ సభ్యులు వెనేపల్లి శ్రీనివాస రావు, ఆదారపు మధు, పైడిమర్రి వెంకట నారాయణ, సేకు శ్రీనివాస రావు, జి. లక్ష్మి నారాయణ, ఈదుల కృష్ణయ్య యాదవ్ ఉన్నారు.