అనధికార రేషనలైజేషన్‌ను వెంటనే ఆపి ఖాళీలన్నింటిని చూపించాలి

68చూసినవారు
అనధికార రేషనలైజేషన్‌ను వెంటనే ఆపి ఖాళీలన్నింటిని చూపించాలి
ఎస్జిటీల బదిలీల కౌన్సిలింగ్ లో జిల్లాలో ఉన్న ఖాళీలన్నింటిని చూపించకుండా కొన్ని ఖాళీలను బ్లాక్ చేయడం సరికాదని సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓరుగంటి నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అనధికారిక రేషనలైజేషన్‌ చేయడం సరియైన చర్య కాదని, దీనిని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియు) తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి మూతబడిన పాఠశాలలను తెరిపించాలని చెబుతుంటే అధికారులు దానికి విరుద్ధంగా పోస్టులను బ్లాక్ చేయడం సరికాదని, అదేవిధంగా ప్రమోషన్లలో భాగంగా మిగిలిన ఖాళీలను వెంటనే సీనియర్ ఉపాధ్యాయులకు కేటాయించాలని, బదిలీలకు ఆప్షన్ పెట్టుకునే సమయాన్ని కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. వెబ్‌సైట్‌లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఒక్కో ఉపాధ్యాయుడు సుమారు 500 నుండి 1500 వరకు ఆప్షన్లు పెట్టుకోవడానికి చాలా సమయం పడుతుందని అందువల్ల ఆప్షన్లు పెట్టుకునే గడువును పొడిగించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్