కోదాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించడం సాంప్రదాయపరంగా వస్తుంది. వరలక్ష్మీ వ్రతం ఆచరించడంతో మాంగల్యబలం చిరకాలం ఉంటుందని వివాహ మహిళలు విశ్వసిస్తారు. కాగా ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.