నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి బైపాస్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ప్రైవేట్ ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ను వెనుక నుండి ఢీ కొట్టి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న మహిళ స్పాట్లో మృతి చెందినది. బస్సులో ఉన్న మరో 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.