లారీ టైర్ కింద పడి అఖిలేష్ కు గాయాలు

56చూసినవారు
లారీ టైర్ కింద పడి అఖిలేష్ కు గాయాలు
హైదరాబాద్ మలక్పేటకు చెందిన అఖిలేష్, అతని స్నేహితులు దుర్గమాత నిమజ్జనానికి లారీ తీసుకెళ్లేందుకు పంతంగి టోల్ ప్లాజా వద్దకు మంగళవారం వెళ్లారు. టోల్ ప్లాజా నుండి విజయవాడ వైపు వెళ్లే లారీ ఆపే ప్రయత్నం చేయగా లారీ డ్రైవర్ ఆపకుండా ముందుకెళ్లడంతో అఖిలేష్ కాలు పై నుండి లారీ టైర్ వెళ్లడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అఖిలేష్ కు ఆసుపత్రికి తరలించారు. అఖిలేష్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్