తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 3 నెలల రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 62% లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని చెప్పారు. మిగిలిన లబ్ధిదారులు కూడా ఈ నెలాఖరు వరకు సన్నబియ్యం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.