Feb 19, 2025, 02:02 IST/నాగార్జున సాగర్ నియోజకవర్గం
నాగార్జున సాగర్ నియోజకవర్గం
సాగర్ బ్యాక్ వాటర్ లో పడి వ్యక్తి మృతి
Feb 19, 2025, 02:02 IST
నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద సాగర్ వెనుకజలాల్లో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైoది. హైదరాబాద్ కిషన్ బాగ్ కు చెందిన గౌసొద్దీన్ ఈనెల 16న స్నేహితులతో కలిసి వైజాక్ కాలనీకి వచ్చి సాగర్ వెనక జలాల్లోకి మరబోటులో వెళ్తుండగా నీటిలో పడి గల్లంతయ్యాడు. రెండు రోజులుగా వెతుకుతుండగా మంగళవారం మృతదేహం లభ్యమైంది. కాగా బోటు నడిపిన రాజుపై కూడా కేసు నమోదు చేసినట్లు ఇంచార్జ్ ఎస్సై సతీష్ తెలిపారు.