నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. శనివారం జలాశయానికి ఇన్ ఫ్లో 67,019 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3,305 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులకు గాను 523.60 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను, 155.9228 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా ప్రారంభమైన ఉత్పత్తి.