నిడమనూరు: బొక్కముంతలపాడులో ఉద్రిక్తత

76చూసినవారు
నిడమనూరు: బొక్కముంతలపాడులో ఉద్రిక్తత
నిడమనూరు మండల పరిధిలోని బొక్కముంతలపాడులో సోమవారం విషాదం జరిగింది. గ్రామానికి చెందిన జానారెడ్డి మల్లేశ్వరిలు హైదరాబాద్ లో ఉంటూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడం, ఆ విషయం ప్రియురాలికి తెలియడంతో మనస్థాపానికి గురై హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. కోపోద్రిక్తులైన మల్లీశ్వరి కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి జానారెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన దిగారు.

సంబంధిత పోస్ట్