నల్గొండ జిల్లాలో తప్పిన పెద్ద ప్రమాదం

63చూసినవారు
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీటీ కాలనీలో దేవుడికి పెట్టిన దీపం అంటుకోవడంతో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అయితే ఇళ్లలో సామగ్రి అంతా కాలిపోయిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. కాగా గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

సంబంధిత పోస్ట్