నల్గొండ జిల్లా నకిరేకల్ చీమల గడ్డ ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు డివైడర్ ను ఢీకొని ఆగిపోయింది. కారులో ఉన్న అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.