నల్గొండ: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

64చూసినవారు
నల్గొండ: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో శనివారం మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వైపు ఇటుకల లోడ్ తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో పెద్దకాపర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ బోల్తా పడిన లారీ ముందు మద్యం మత్తులో నిద్రపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్