తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సజీవంగా నిలబెట్టి విజయతీరాలకు చేర్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం హర్షం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసి కొత్త రాష్ట్ర ఉద్యమానికి జీవం పోశారని, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజగోపాల్ లాంటి నేతలు పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడారని కొనియాడారు.