రామన్నపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

8చూసినవారు
రామన్నపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన బి.రాజుయాదవ్ (35) తనకున్న ఎకరం పొలంలో వరి సాగు చేస్తున్నాడు. గత రెండు సీజన్ల నుండి పంట ఎండిపోవడంతో రూ.2 లక్షలు అప్పు తెచ్చి బోరు వేసుకున్నాడు. అప్పు తెచ్చి వేసిన బోరు కూడా వృథా అవ్వడంతో, అప్పు తీర్చలేనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

సంబంధిత పోస్ట్