తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు కొత్తగా జిల్లా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్‌గా అడ్లూరి లక్ష్మణ్ ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లాకు గడ్డం వివేక్, ఖమ్మానికి వాకిటి శ్రీహరి, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు లభించిన వివేక్‌ను మెదక్‌కు నియమించారు.