రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి 10 జిల్లాలకు ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ప్రత్యేక అధికారిగా పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రభుత్వం నిర్వహించే వివిద కార్యక్రమాలకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు.