టోల్ ఛార్జీలు పెరిగాయని పేర్కొంటూ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులకు సోమవారం నుంచి టికెట్ ధరలు పెరిగాయి. నాన్స్టాప్ రూ.180 నుంచి రూ.190కు, ఎక్స్ప్రెస్ రూ.150 నుంచి రూ.170కు, ఆర్డినరీ రూ.130 నుంచి రూ.140కు పెరిగింది. ధరలు అకస్మాత్తుగా పెరగడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.