ఇటీవల కాలంలో అమెరికాలో భారత విద్యార్థుల మృతులు పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలతో చదువు కోసం వెళ్లిన వారు తమ ప్రాణాలు పొగొట్టుకొని వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి విషాద సంఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. కట్టంగూరు మండలంలోని పందెనపల్లి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందినట్లు సమాచారం అందించారు. అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదివిన ప్రియాంక. బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.