నల్లగొండ: రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్

52చూసినవారు
నల్లగొండ: రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్
నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంగా శుక్రవారం దురదృష్టకర ఘటన జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోశెట్టి నిషాంత్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్టు తెలిసింది. కేశరాజుపల్లి వద్ద రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం లభ్యమైంది. రెండేళ్ల క్రితం నిషాంత్ తన మేన మరదలిని రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్