కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన గర్భిణి కడుపులోని శిశువు మృతిచెందిన ఘటన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. స్థానికుల వివరాలిల ప్రకారం.. గుడిపల్లి కేశినేనితండాకు చెందిన జాన్సీ తొలి కాన్పు కోసం ఈనెల 6న ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. గురువారం డాక్టర్లు ఆమె స్కానింగ్ రిపోర్టును పరిశీలించగా కడుపులోని బిడ్డ చనిపోయింది. తల్లి పరిస్థితి బాలేదని.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ధర్నా చేశారు.