నల్గొండ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

4చూసినవారు
నల్గొండ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెట్లముకుందాపురంలో శనివారం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మామిడి శ్రీనివాస్ (55) తమ ఇంట్లో నీటి సంపు వద్ద ఉన్న మోటారు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్