ఈ నెలలోనే 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి ఆదివారం ట్వీట్ చేశారు. ఈనెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే సభలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ ఇస్తామని చెప్పారు. గత 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్లు పేర్కొన్నారు.