సాంకేతిక లోపం కారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నల్గొండ రైల్వే స్టేషన్‌లో అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో ట్రైన్ కొనసాగకపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి రైలును గమ్యస్థానానికి పంపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.