నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో ఓ యువతి శుక్రవారం ఉరివేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం షాపులో పనిచేసే సతీశ్ అని మృతురాలి తల్లి రోదిస్తూ తెలిపింది. ఫోన్లో అతడు అసభ్యకర మెసేజ్ లు పెట్టడం వల్లే వాణి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిందని చెప్పింది.