నల్గొండ రైల్వే స్టేషన్‌లో ఓ యువతి ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందింది. బోయినపల్లికి చెందిన రుత్విక (18) చర్లపల్లి నుంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. నల్గొండ స్టేషన్ కు రాగానే వాటర్ బాటిల్ కోసం దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై నాగరాజు తెలిపారు.