తెలంగాణ రాష్ట్ర రక్తదాతల యూనియన్ ఏర్పాటు దిశగా అడుగులు

64చూసినవారు
తెలంగాణ రాష్ట్ర రక్తదాతల యూనియన్ ఏర్పాటు దిశగా అడుగులు
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్ జీ కళాశాల ఆవరణలో ఆదివారం ఉమ్మడి జిల్లా రక్తదాన వాలంటీర్లు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానానికి యువతను ప్రోత్సహించేందుకు, రక్తదానం పరంగా వెనుకంజలో ఉన్న ప్రాంతాలలో రక్తదాన శాతం పెంచేందుకు, నెగెటివ్ రక్తదాతలకు ఇన్స్యూరెన్స్ సదుపాయం ఇస్తూ వారిని ఇంకా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర రక్తాధాతల యూనియన్ పనిచేస్తుందని, ఈ కళాశాల వేదికగా ఆ దిశగా నేడు అడుగులు పడ్డాయని అన్నారు.

సంబంధిత పోస్ట్