తనను అత్తింటి వారు వేధిస్తున్నారంటూ యువకుడు పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ మండలంలోని గుర్రంతండాలో గురువారం జరిగింది. గుర్రంతండాకు చెందిన యువకుడు విజయ్ ఓ యువతిని ప్రేమించి 9 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అత్తింటి వారు తనపై కేసులు పెట్టడమే కాకుండా తీవ్రంగా అవమానించారని ఆవేదన చెందుతూ పురుగు మందు తాగాడు. అతణ్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.