బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 22 ఏండ్ల జైలు శిక్ష, రూ. 35 వేల జరిమానా విధిస్తూ నల్గొండ జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అల్లం మహేశ్ 2013లో ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల తర్వాత నిందితుడికి జడ్జి తుది తీర్పు చెప్పారు.